హైదరాబాద్: 28°C
తెలంగాణ

జనరల్ సర్జరీ సేవలకు శ్రీకారం

BDK: అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో జనరల్ సర్జరీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. జనరల్ సర్జన్ డాక్టర్ అంబటి శైలేంద్ర కుమార్ ఆధ్వర్యంలో దమ్మపేట మండలానికి చెందిన మొడియం జ్యోతికి మోకాలి పైభాగంలోని కణితిని విజయవంతంగా తొలగించారు. ఐదుగురు వైద్యులు విధుల్లో చేరడంతో సేవలు విస్తరించాయని సూపరింటెండెంట్ డాక్టర్ రాధారుక్మిణి తెలిపారు.