NRPT: చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని మక్తల్ మున్సిపల్ ఛైర్ పర్సన్ వాకిటి మానస అన్నారు. బుధవారం పట్టణంలోని 12వ వార్డులో ప్రత్యేక వార్డు పారిశుద్ధ్య పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణాన్ని శుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజయ్య, ఏఈ నాగాశివ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
పరిసరాలను శుభ్రంగా ఉంచాలి: ఛైర్ పర్సన్


