HYD: సికింద్రాబాద్‌లో రైల్వే పోలీసులు పోయిన మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. CIER పోర్టల్ ద్వారా రూ.2.16 కోట్ల విలువైన 1,620 మొబైల్ ఫోన్లను గుర్తించి, బాధిత ప్రయాణికులకు అందజేశారు. పలు రాష్ట్రాల్లో ఫోన్లను ట్రాక్ చేసి స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే డీఎస్పీ జావేద్ తెలిపారు. మొబైల్ పోయిన వెంటనే CIER పోర్టల్‌లో IMEI నంబర్‌తో బ్లాక్ చేయించుకోవాలని సూచించారు.
తెలంగాణ
పోయిన ఫోన్లు.. రైల్వే పోలీసుల రికవరీ


