హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇద్దరి కానిస్టేబుల్‌లకు పదోన్నతి..

NZB: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన ఎ. గణేష్ (పీసీ-74), కే. వినోద్ కుమార్ (పీసీ-605)లను పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. పదోన్నతులతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. పోలీస్ శాఖలో మరింత బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు.