హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమస్యలను పరిష్కరించాలి: మాజీ ఎమ్మెల్యే

KMM: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. బుధవారం సత్తుపల్లిలో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 10న TGEJAC ఆధ్వర్యంలో జరిగే చలో హైదరాబాద్-మహాధర్నాకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన డీఏలు, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.