హైదరాబాద్: 28°C
తెలంగాణ

బూరెటిపల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

VKB: చౌడాపూర్‌ మండలం బూరెటిపల్లిలో రూ.8 లక్షల ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్‌ పరిగి నవీన్‌కుమార్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ ఎల్పటి అశోక్‌కుమార్‌ సోమవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే డాక్టర్‌ టి.రామ్మోహన్‌రెడ్డి సూచనల మేరకు పనులు చేపట్టినట్లు తెలిపారు. సీసీ రోడ్డు నిర్మాణంతో గ్రామస్తుల రాకపోకల సమస్యలు తొలగుతాయని పేర్కొన్నారు.