హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ సరికాదు: ఆనంద్

VKB: ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తూ ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మాజీ ఎమ్మెల్యే ఆనంద్ విమర్శించారు. మహిళా ప్రజాప్రతినిధులపై పోలీసుల వ్యవహారాన్ని ప్రశ్నించిన వారిని, ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం కోరిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం సరికాదన్నారు.