హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ

KMR: దామరంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజన పథకాన్ని బీర్కూర్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బోయిని శంకర్ తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత రుచిని పరిశీలించారు. విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. విద్యార్థులకు నాణ్యమైన పరిశుభ్రమైన భోజనం అందేలా చూడాలని నిర్వాహకులుకు సూచించారు.