హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎరువుల కొనుగోలు యాప్ రద్దు చేయాలి: ఎమ్మెల్సీ

NLG: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎరువుల విక్రయ యాప్ రైతుల పాలిట శాపంగా మారిందని MLC నెల్లికంటి సత్యం అన్నారు. కౌలు రైతులకు యాప్ విధానంతో ఎరువులు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా పొందాలంటే పట్టాదారులపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని యాప్ తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని శాసనమండలిలో డిమాండ్ చేశారు.