హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉప సర్పంచుల చెక్ పవర్ రద్దు చేయాలి'

MBNR: ఉప సర్పంచ్‌ల చెక్ పవర్ వెంటనే రద్దు చేయాలని జిల్లా సర్పంచుల ఛాంబర్ అధ్యక్షులు బత్తుల వెంకట రాములు గౌడ్ డిమాండ్ చేశారు. ఈ విషయమై బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ హరిప్రియకు వినతిపత్రం సమర్పించారు. సర్పంచులకు గౌరవ వేతనాన్ని కూడా పెంచాలన్నారు. అలాగే సమయానికి నిధులు విడుదల కావడం లేదని ఆరోపించారు.