హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులు ప్రారంభించిన మున్సిపల్ ఛైర్ పర్సన్

JN: జనగామ పట్టణంలోని 3వ వార్డులో మున్సిపల్ ఛైర్‌పర్సన్ కడకంచి బాలమణి-శ్రీనివాస్‌లు బుధవారం పర్యటించారు. ఈ సందర్బంగా నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు, మోరి (డ్రైనేజీ) పనులను వారు ప్రారంభించారు. పనులు వేగంగా నాణ్యతతో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు మున్సిపాలిటీ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని వారన్నారు.