హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్‌ఎస్ తీరుపై భట్టి ఫైర్..!

KMM: దళిత సంఘాల ఆందోళన బాటను బీఆర్‌ఎస్ నేతలు పసుపు నీళ్లతో శుద్ధి చేయడంపై మధిర ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దళితులను ఘోరంగా అవమానించడమేనని మండిపడ్డారు. బలహీనవర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, విపక్షాల ఆగడాలను సంయమనంతో భరిస్తున్నామని భట్టి స్పష్టం చేశారు.