హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కాళోజిని నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాలి'

KNR: తెలంగాణ యాస, భాషల మధురత్వాన్ని తన రచనలతో చాటిన ప్రజాకవి కాళోజిని నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాలని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. బుధవారం కాళోజి 112వ జయంతి సందర్భంగా రేకుర్తి 19వ డివిజన్‌లో ఆయన విగ్రహానికి మేయర్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మాధవికృష్ణగౌడ్, కాలనీ అధ్యక్షులు రమణారెడ్డి, నారాయణరెడ్డి పాల్గొన్నారు.