హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విగ్రహ దిమ్మెను ఢీకొట్టిన కారు

NGKL: శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై మన్ననూరు అంబేద్కర్ చౌరస్తా వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి అదుపుతప్పి అంబేద్కర్ విగ్రహ దిమ్మెను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను మన్ననూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.