HYD: ఆయుర్వేద, హోమియోపతి, యునాని, నేచురోపతి విద్యార్థుల స్టైఫండ్‌ను ప్రభుత్వం భారీగా పెంచింది. హౌస్ సర్జన్లకు రూ.13,754 నుంచి రూ.29,792కు, పీజీ విద్యార్థులకు రూ.34,385 నుంచి రూ.74,482కు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అల్లోపతి వైద్య విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ పెంచడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
VIDEO: స్టైఫండ్ పెంపుపై విద్యార్థుల హర్షం


