హైదరాబాద్: 28°C
తెలంగాణ

టేకుమట్ల పీఎస్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

JN: టేకుమట్ల మండలంలోని పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. అనంతరం కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలన్నారు.