హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు టీడీ టీకాలు

SRCL: చందుర్తి మండలం సనుగుల ప్రాథమిక పాఠశాలలో 10 ఏళ్లు పూర్తైన విద్యార్థులకు టెటానస్, డిఫ్తీరియా (టీడీ) టీకాలు వేశారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా టీకాలు అందించినట్లు ప్రధానోపాధ్యాయుడు ముఖేష్‌ కటుకూరి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మేకల పద్మ, కోరెపు శ్రీనివాస్, నాతరి నాగమణి, చింతల హరిష్మ, దుంపెట మమత, ఎగోళం మాధవి పాల్గొన్నారు.