హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహా ధర్నా పోస్టర్‌ ఆవిష్కరణ

RR: షాద్‌నగర్ ఆర్డీవో కార్యాలయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మహా ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. 2వ పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏలు, బిల్లుల చెల్లింపు, ఓపీఎస్ పునరుద్ధరణ, క్యాష్‌లెస్ ఈహెచ్‌ఎస్ అమలు వంటి డిమాండ్లతో సెప్టెంబర్ 10న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న మహా ధర్నాను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.