హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కాళోజి కవిత్వం స్ఫూర్తిదాయకం'

RR: షాద్‌నగర్‌లో టీజేఏసీ ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ డాక్టర్ కాళోజి నారాయణరావు జయంతిని నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాళోజి రచనలు, కవిత్వం తెలంగాణ ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినిచ్చాయని వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.