హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.18 వేల వేతనం ఇవ్వాలని వినతి

KMR: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఆశా కార్యకర్తలకు రూ.18 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బిక్కనూర్ మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నర్సింలు మాట్లాడుతూ.. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించి, హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.