హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎయిర్‌పోర్ట్ స్థలాలను పరిశీలించిన ఎంపీ..!

KMM: ప్రతిపాదిత విమానాశ్రయ స్థల ఎంపిక కోసం కేంద్ర బృందం బుధవారం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. ఈ సందర్భంగా ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి అధికారులతో కలిసి సీతంపేట, గరీబ్ పేట, అబ్బుగూడెం ప్రాంతాల్లో పర్యటించారు. రన్‌వే నిర్మాణం, భౌగోళిక పరిస్థితులను అధికారులు అంచనా వేశారు. ఈ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా ఎయిర్‌పోర్ట్ స్థలాన్ని ఖరారు చేస్తారు.