హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 11న జాబ్ మేళా..!

MHBD: జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 11న డెలివరీ కంపెనీ ఉద్యోగాల కోసం జాబ్ మేళా జరగనుంది. జిల్లా ఉపాధి అధికారి రజిత తెలిపిన వివరాల ప్రకారం.. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దీనికి అర్హులు. మొత్తం 25 ఖాళీలు ఉండగా, 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు పాల్గొనవచ్చు. ఆసక్తి గలవారు జిల్లా ఉపాధి కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు.