RR: చేవెళ్ల పట్టణంలోని 17వ వార్డు రంగారెడ్డినగర్‌లో రూ.50 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కాలే యాదయ్య శంకుస్థాపన చేశారు. రోడ్డు నిర్మాణంతో ప్రజల ఇబ్బందులు తొలగుతాయని తెలిపారు. చేవెళ్ల మున్సిపల్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సమతా వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
తెలంగాణ
సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన


