KNR: సైదాపూర్ మండలం లస్మన్నపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సర్పంచ్ మ్యాకల స్వప్న బుధవారం ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన బోధన అందుతోందన్నారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాకేష్, హెచ్‌ఎం అర్చన, పాల్గొన్నారు.
తెలంగాణ
లస్మన్నపల్లి విద్యార్థులకు ఏకరూప దుస్తులు


