నాగర్‌కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 112వ జయంతి వేడుకలు జరిగాయి. అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ భాషా, సంస్కృతులకు, ప్రజా చైతన్యానికి కాళోజీ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కాళోజీ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'కాళోజీ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలి'


