WGL: ఖానాపురం మండల కేంద్రంలో బుధవారం పట్టపగలే కోడి పందాలు నిర్వహణ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కత్తులు కట్టిన రెండు కోళ్లతో పాటు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని, పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, వివరాలను పోలీసులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
తెలంగాణ
ఖానాపురంలో పట్టపగలే కోడి పందాలు..!


