హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

నాజూకైన నడుము కోసం ఇలా చేయండి!

నాజూకైన నడుము కోసం కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. రాత్రి భోజనం నిద్రపోయేముందు 2 గంటల ముందే ముగించాలి. జంక్‌ఫుడ్, వేపుళ్లకు దూరంగా ఉంటూ పండ్లు, కూరగాయలు, ప్రొటీన్లు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన కొవ్వులుండే గింజలు, అవకాడోలను ఆహారంలో చేర్చాలి. తక్కువ క్యాలరీల ఆహారంతో పాటు క్రమం తప్పకుండా నడక, డ్యాన్స్, వ్యాయామాలు చేయాలి. తగినంత నిద్ర కూడా ఎంతో అవసరం.