హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఈవీ టూవీలర్లదే హవా.. 236% పెరిగిన సేల్స్

ఎలక్ట్రిక్ టూవీలర్ల విభాగంలో విక్రయాలు దూసుకుపోతున్నాయి. ఆగస్టులో వీటి సేల్స్ 67 శాతం వృద్ధితో 1,83,204 యూనిట్లకు చేరుకున్నాయి. మొత్తం టూవీలర్ల అమ్మకాల్లో ఈవీల వాటా 10.7 శాతానికి పెరిగింది. ఈవీ టూవీలర్లలో టీవీఎస్ మోటార్(48,938 యూనిట్లు) టాప్‌లో ఉండగా, బజాజ్ ఆటో అమ్మకాలు ఏకంగా 236 శాతం పెరిగి 41,114 యూనిట్లకు చేరాయి. ఏథర్, హీరో సంస్థలు కూడా గణనీయమైన వృద్ధిని సాధించాయి.