హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఆగస్టులో అదరగొట్టిన ఈవీ సేల్స్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(EV) విక్రయాలు జోరు మీదున్నాయి. ఫాడా నివేదిక ప్రకారం, గత నెలలో(ఆగస్టు) ఈవీ సేల్స్ 53 శాతం పెరిగాయి. గతేడాది ఆగస్టులో 1,95,250 వాహనాలు సేల్ కాగా, ఈసారి ఆ సంఖ్య 2,98,448కి చేరింది. అయితే, జులై(3,27,901) నెలతో పోలిస్తే ఆగస్టులో అమ్మకాలు 9 శాతం మేర తగ్గడం గమనార్హం. ప్రధానంగా టూవీలర్, ప్యాసింజర్ వాహనాలకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది.