హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజలను చైతన్యపరిచిన గొప్ప వ్యక్తి కాళోజీ: అదనపు కలెక్టర్

ADB: సాధారణ ప్రజానీకానికి అర్థమయ్యేలా తెలంగాణ యాసలో ఎన్నో కవితలు రచించి, ప్రజలను చైతన్యపరిచిన గొప్ప వ్యక్తి కాళోజీ అని అదనపు కలెక్టర్ ఆర్.ఎస్.చిత్రు అన్నారు. బుధవారం పెన్ గంగా భవన్‌లోని అదనపు కలెక్టర్ కార్యాలయంలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాళోజీ సేవలకు కేంద్ర ప్రభుత్వం 1992లో పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించిందని చెప్పారు.