హైదరాబాద్: 28°C
తెలంగాణ

సన్నూరు దేవస్థానం మీదుగా వరంగల్‌కు బస్సు

WGL: తొర్రూరు నుంచి వరంగల్‌కు నూతన బస్సు సర్వీసు ప్రారంభమైంది. రాయపర్తి మండలం సన్నూరు స్వయంభూ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం మీదుగా మొరిపిరాల నుంచి వరంగల్‌కు ఈ బస్సు రాకపోకలు సాగించనుంది. బుధవారం సన్నూరులో బస్సు సర్వీసును ప్రారంభించారు. భక్తులు, ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.