SDPT: మద్దూరులో ఆర్టీసీ బస్సులను సకాలంలో నడపాలని డిమాండ్ చేస్తూ లద్నూర్ గ్రామంలో విద్యార్థులు రహదారిపై ధర్నా నిర్వహించారు. మద్దూరు నుంచి జనగామ జిల్లా కేంద్రానికి వెళ్లే బస్సులు సమయానికి రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. విద్యాసంస్థలకు సకాలంలో చేరలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి బస్సు సర్వీసులను సక్రమంగా నడపాలని కోరారు.
తెలంగాణ
బస్సుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు


