HNK: హన్మకొండలో శ్రీ రుద్రేశ్వరస్వామి వారి వేయి స్తంభాల దేవాలయంలో ఈ నెల 14 నుంచి 23 వరకు ఉత్తిష్ఠ గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో గణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు, విశేష కైంకర్యాలు నిర్వహించనున్నారు. 23న నిమజ్జనోత్సవం జరగనుంది. అందుకు సంబంధించిన ఉత్సవాల కరపత్రాలను బుధవారం ఎంపీ కడియం కావ్య ఆవిష్కరించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఉపేంద్రశర్మ ఉన్నారు.
తెలంగాణ
గణపతి నవరాత్రి ఉత్సవాల కరపత్రాలు ఆవిష్కరణ


