హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణపతి నిమజ్జనానికి చెరువులు సిద్ధం

HYD: వినాయకచవితి నవరాత్రులు, నిమజ్జనోత్సవాల నేపథ్యంలో హైదరాబాద్‌లో సందడి నెలకొంది. నిమజ్జనానికి ఇబ్బందులు లేకుండా GHMC పరిధిలోని 47 చెరువుల వద్ద ఏర్పాట్లు చేసింది. క్రేన్లు అందుబాటులో ఉంచింది. ఎన్టీఆర్ గ్రౌండ్‌లో 21, ఖైరతాబాద్‌లో 41 క్రేన్లు ఏర్పాటు చేశారు. నిమజ్జనానికి పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని కమిషనర్ కర్ణన్ తెలిపారు.