హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గుండెపోటుతో కుప్పకూలిన గ్రానైట్ వ్యాపారి

KMM: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వెంకటగిరి క్రాస్ రోడ్డు వద్ద బుధవారం ఉదయం ఓ గ్రానైట్ వ్యాపారి గుండెపోటుకు గురయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం.. అటుగా వెళ్తున్న గ్రానైట్ వ్యాపారి దుర్గాప్రసాద్ గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు అతనిని గమనించి, సీపీఆర్ చేసి అంబులెన్స్‌లో ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.