NLG: దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ తియాన్ మావి ఆధ్వర్యంలో బుధవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈనెల 14 నుంచి జరగనున్న గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలని పలు సూచనలు చేశారు. శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని అన్నారు. ప్రజలు అందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో స్థానిక డీఎస్పీ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
దేవరకొండలో శాంతి కమిటీ సమావేశం


