హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగరేణి క్రీడాకారులకు బాస్కెట్‌బాల్ పోటీలు

PDPL: రామగుండం సింగరేణి RG-1 ఆధ్వర్యంలో గోదావరిఖని స్టేడియంలో బుధవారం సంస్థ క్రీడాకారులకు బాస్కెట్‌బాల్ పోటీలు నిర్వహించారు. ఏరియా వర్క్‌షాప్ డీజీఎం జితేందర్‌సింగ్ పోటీలను ప్రారంభించి క్రీడాకారులను అభినందించారు. క్రీడలతో పాటు క్రీడాకారులను సింగరేణి ప్రోత్సహిస్తోందన్నారు. ఇందులో అధికారి హనుమంతరావు, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ గాండ్ల రాజయ్య పాల్గొన్నారు.