ADB: గుడిహత్నూర్ మండలంలోని గురుజ్ గ్రామంలో బుధవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు తొడసం దౌలత్ రావు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. అర్హులకు సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జాదవ్ కల్పన, గ్రామస్తులు, మహిళలు, తదితరులు ఉన్నారు.
తెలంగాణ
'అర్హులకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం'


