JN: జిల్లా కలెక్టరేట్‌లో కాళోజీ నారాయణరావు 112వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఆత్మ, ప్రజల సమస్యలను కాళోజీ తన రచనల్లో ప్రతిబింబించారని, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల కోసం ఆయన చేసిన కృషి ఆదర్శమని అన్నారు. కాళోజీ ఆశయాలను భావితరాలు కొనసాగించాలన్నారు.
తెలంగాణ
కలెక్టరేట్‌లో కాళోజీ 112వ జయంతి వేడుకలు


