హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కాళోజీ ఆశయాల సాధనకు కృషి'

SDPT: జిల్లా మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ భాషా దినోత్సవం, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, ఆర్వో శ్రీకాంత్, జేఏఓ వెంకట్రావు కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాహిత్యం, సామాజిక చైతన్యానికి కాళోజీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.