JGL: సీసీ కెమెరాలతో నేరాలకు సులభంగా చెక్ పెట్టవచ్చని జగిత్యాల డీఎస్పీ పురుషోత్తంరెడ్డి అన్నారు. బుధవారం జగిత్యాల రూరల్ నర్సింగాపూర్‌లో సర్పంచ్ వంశీ దాతల సాయంతో ఏర్పాటుచేసిన 22 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. గ్రామ భద్రతకు సర్పంచ్ చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన అన్నారు. సీఐ సుధాకర్, ఎస్సై ఉమాసాగర్, పాలకవర్గం, ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ
సీసీ కెమెరాలతో నేరాలకు సులభంగా చెక్


