హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం: ఎస్పీ

GDWL: తెలంగాణ భాషా పరిరక్షణకు, సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ నారాయణరావు చేసిన సేవలు చిరస్మరణీయమని గద్వాల ఎస్పీ టి.శ్రీనివాసరావు కొనియాడారు. బుధవారం కాళోజీ 112వ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సామాజిక చైతన్యం నింపిన ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు.