హైదరాబాద్: 28°C
తెలంగాణ

42 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు

JGL: జగిత్యాల లయన్స్ క్లబ్, పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో 42 మందికి కంటి ఆపరేషన్ అవసరమని గుర్తించారు. వారిని కరీంనగర్‌లోని రేకుర్తి ఆసుపత్రికి తరలించి ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించారు. అనంతరం వారిని బుధవారం జగిత్యాలకు తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు గుండేటి గంగాధర్, వడ్లగట్ట శంకర్ ఉన్నారు.