హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీటీపీఎస్‌లో కాళోజికి ఘన నివాళి

BDK: మణుగూరు మండలంలోని బీటీపీఎస్‌లో బుధవారం తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు నిర్వహించారు. సీఈ బిచ్చన్న కాళోజి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ భాష, సాహిత్యానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. భాషా పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.