హైదరాబాద్: 28°C
తెలంగాణ

శబ్ద కాలుష్యంపై ఖైరతాబాద్ పోలీసుల ఆదేశాలు

HYD: గణేష్ నవరాత్రుల శోభాయాత్ర నేపథ్యంలో ఖైరతాబాద్ SHO డీజే, బ్యాండ్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఊరేగింపులలో పరిమితికి మించి శబ్దం చేయకూడదని, నిబంధనలకు లోబడి నిర్ణీత సమయాలను కచ్చితంగా పాటించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.​ చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.