హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు

BHPL: కాటారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రముఖ కవి, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి ఎ. బాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొని కాళోజీ సాహిత్య, సామాజిక సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ చరిత్రలో ఆయనకు సముచిత స్థానం ఉంటుందని వెల్లడించారు.