హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టరేట్‌లో కాలోజీ జయంతి వేడుకలు

PDPL: జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీరాములు జ్యోతి ప్రజ్వలన చేసి, కాళోజి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ప్రజల్లో సామాజిక, రాజకీయ చైతన్యం తీసుకురావడంలో కాలోజీ కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.