నిజామాబాద్ జిల్లా ధర్‌పల్లి మండలం మరియా తండాలో ఇవాళ విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. విజయ్ అనే యువకుడు సెల్ఫీ వీడియో తీసుకొని పురుగు మందు తాగి చనిపోయాడు. తాను ప్రేమించిన యువతి మరో పెళ్లికి సిద్ధమైందని, నిన్న వారి ఎంగేజ్‌మెంట్ ఫొటో చూసి మనస్తాపంతో చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో విజయ్ తెలిపాడు. కాగా ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
VIDEO: ప్రేమించిన అమ్మాయి కోసం యువకుడు ఆత్మహత్య!


