NRPT: సెప్టెంబర్ 11న మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సాయిలక్ష్మి తెలిపారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని కోరారు. మండల సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమ సూచనలు, అభిప్రాయాలు వెల్లడించాలని సూచించారు.
తెలంగాణ
ఈ నెల 11న మండల స్థాయి సమీక్ష సమావేశం


