హైదరాబాద్: 28°C
తెలంగాణ

చదువుతో పాటు క్రీడలు ముఖ్యం: MEO

MDK: చిన్న శంకరంపేట జూనియర్ కళాశాల ప్రాంగణంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) క్రీడా పోటీలు ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి. ఎంఈఓ దీప్లా రాథోడ్, సర్పంచ్ చంద్రశేఖర్ జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. క్రీడలు మానసిక ప్రశాంతతను, శరీరానికి దృఢత్వాన్ని ఇస్తాయని, విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించి క్రీడాస్ఫూర్తిని నిలబెట్టాలని నేతలు ఆకాంక్షించారు.